తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో 26 జిల్లాలు, 57 రెవెన్యూ డివిజన్లకు ప్రతిపాదన

ఏపీలో 26 జిల్లాలు, 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అధికారుల కమిటీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు సిఫారసు చేసింది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పు-చేర్పులు చేసింది. కొత్తగా తొమ్మిది ఏర్పాటు.. మూడింటిని రద్దుచేయాలని ప్రతిపాదించింది.

AP NEW DISTRICTS
ఏపీలో 26 జిల్లాలు, 57 రెవెన్యూ డివిజన్లకు ప్రతిపాదన

By

Published : Jan 10, 2021, 7:07 AM IST

లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన ఏపీలో జిల్లాల ఏర్పాటుకు అధికారుల కమిటీ సూచనలు చేసింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను క్రోడీకరించి కొత్త జిల్లాలు, ముఖ్య కేంద్రం, వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలతో నివేదిక రూపొందించింది. ప్రతి జిల్లాలో 2-3 డివిజన్లను ప్రతిపాదించింది.

జిల్లాల హద్దులపై దృష్టిసారించాలి..

బాపట్ల ప్రతిపాదిత జిల్లాలో కొత్తగా.. బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై ఆ శాఖ దృష్టిసారించాలని సిఫారసు చేసింది. విద్య, ఆరోగ్యం, అటవీ, వాణిజ్య పన్నులు, ఇంజినీరింగ్‌ తదితర శాఖలు.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. విస్తీర్ణం, జనాభా, ఆదాయం, చారిత్రక అనుబంధాలు, ప్రజాప్రయోజనాలు, సమస్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ప్రస్తావించింది.

మార్పులు- చేర్పులు..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్‌లోకి, ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్‌లోకి చేర్చాలని కమిటీ సూచించింది. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు డివిజన్‌ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాలను.. కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డిగూడెం డివిజన్‌లోకి చేర్చాలని ప్రతిపాదించింది. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక డివిజన్‌ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే రంపచోడవరం డివిజన్‌లోకి చేర్చాలని సిఫారసు చేసింది.

ఏపీలో .. విజయనగరం జిల్లా జామి, విశాఖ జిల్లా పెదగంట్యాడ, విజయవాడ గ్రామీణం, తిరుపతి పట్టణం, అనంతపురం మండలాల్లోని కొన్ని గ్రామాలు... 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నాయని వీటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

కొత్త జిల్లాల్లో..

కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో అరకు మొదటి జిల్లాకు పార్వతీపురం, రెండో జిల్లాకు పాడేరు.. హిందూపురం జిల్లాకు హిందూపురం లేదా పెనుకొండను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి.. 2 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలు.. మొదటి జిల్లా పరిధిలోకి.. అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను రెండో దాని పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.

ఇవీచూడండి:భార్గవరామ్‌ బెంగళూరులో ఉన్నాడా.. పుణె వెళ్లాడా?

పంచాయతీ ఎన్నికలపై హౌస్‌మోషన్‌ పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details