ఇంజినీరింగ్ కొలువులపై కరోనా తీవ్రప్రభావం చూపుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన 79 శాతం మందికి కొవిడ్ పుణ్యమా అని కొలువులు కరవయ్యాయి. కరోనా నేపథ్యంలో వివిధ బ్రాంచీలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, కొలువులపైన ‘బ్రిడ్జి ల్యాబ్ సొల్యూషన్స్’ అనే ప్రముఖ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఇదే వెల్లడైంది. మొత్తం 1000 మంది విద్యార్థులను (60 శాతం అబ్బాయిలు, 40 శాతం అమ్మాయిలు) ఈ సంస్థ సర్వే చేసింది.
ఇంజినీరింగ్ కొలువులపై.. కొవిడ్ పడగ - bridge lab solutions survey on engineering placements
కరోనా వైరస్ ఎంతో మంది కలలను కల్లలు చేస్తోంది. గొప్ప భవిష్యత్తును ఊహించుకున్న లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లింది. కొవిడ్ పుణ్యమా అని కొలువులు కరవయ్యాయి.
education
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తమకు ఉద్యోగం రాలేదని 78.64 శాతం మంది పేర్కొన్నారు. వారిలో 76 శాతం మంది తాము చదివిన కళాశాలలో క్రియాశీలకంగా పనిచేసే ప్లేస్‌మెంట్ విభాగం ఉందని చెప్పడం గమనార్హం. ప్రాంగణ నియామకాల విభాగాలు ఉన్నా ఉద్యోగాలు దక్కలేదు. ఈ విభాగాల ద్వారా అయిదో వంతు మాత్రమే కొలువులు పొందినట్లు సర్వేలో తేలింది.