ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు - Etv Bharat director bruhathi
రామోజీ ఫిల్మ్‌సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు.
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీలు రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, హెచ్ఆర్ ప్రెసిడెంట్ గోపాలరావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి పాల్గొన్నారు. పలువురు ఉన్నతోద్యోగులు, సిబ్బంది వేడుకలకు హాజరయ్యారు.
- ఇదీ చూడండి :జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్