తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు

ap cases
ap cases

By

Published : Sep 23, 2020, 4:28 PM IST

Updated : Sep 23, 2020, 5:19 PM IST

16:26 September 23

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు

ఏపీలో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి బాధితుల సంఖ్య 6,46,530కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 5,506 మంది మృతి చెందారు. ప్రస్తుతం 70,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్ నుంచి 5,70,667 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 72,838 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 53,02,367 కరోనా పరీక్షలు చేశారు.  

జిల్లాల వారీగా కరోనా మృతులు

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున కొవిడ్ బారిన పడి మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు. అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా... గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు.  

జిల్లాల వారీగా కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నా... తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. జిల్లాలో అత్యధికంగా 1,112 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 962, గుంటూరు జిల్లాలో 648 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 612, కడప జిల్లాలో 600 కేసులు, చిత్తూరు జిల్లాలో 536, ప్రకాశం జిల్లాలో 502, నెల్లూరు జిల్లాలో 479, కృష్ణా జిల్లాలో 428, విశాఖ జిల్లాలో 414, విజయనగరం జిల్లాలో 387 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.  

ఇదీ చదవండి :మోదీ సతీసమేతంగా పూజలు చేశారా?: కొడాలి నాని

Last Updated : Sep 23, 2020, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details