ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 538 మందికి కరోనా సోకినట్లుగా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 73వేల 995కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేల 237 ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో 558 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 61 వేల 711కి పెరిగింది. వైరస్ కారణంగా ఇవాళ ఇద్దరు మృతి చెందగా..ఇప్పటి వరకు మెుత్తం మృతుల సంఖ్య 7,047కు చేరుకుంది.
ఏపీలో గురువారం 538 కరోనా కేసులు, 2 మరణాలు
ఏపీలో గురువారం 538 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 73 వేల 995కు చేరింది. మెుత్తం మృతుల సంఖ్య 7,047కు పెరిగింది.
ఏపీలో గురువారం 538 కరోనా కేసులు, 2 మరణాలు
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 95 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి 50, అనంతపురం 14, కృష్ణా 86, పశ్చిమగోదావరి 72, గుంటూరు 72 ,కడప 13 మంది, కర్నూలు 18, నెల్లూరు 24, ప్రకాశం 35, శ్రీకాకుళం 21, విశాఖపట్నం 31, విజయనగరం 7 చొప్పున కేసులు నమోదయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.
ఇదీ చదవండి:జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడిని ఖండించిన బండి సంజయ్