తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓల్డ్ మలక్​పేటలో నేడు రీపోలింగ్

రాష్ట్ర ఎన్నికల సంఘం బల్దియా ఎన్నికల తుదిపోలింగ్‌ శాతాన్ని ప్రకటించింది. 149 డివిజన్‌లకు జరిగిన ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్‌ జరిగినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్తుల తారుమారు కావడం వల్ల ఓల్డ్‌మలక్‌పేటలో నేడు రీపోలింగ్‌ జరగనుంది.

గ్రేటర్​లో తుదిపోలింగ్ 46.55 శాతం.. ఓల్డ్ మలక్​పేటలో రేపు రీపోలింగ్
గ్రేటర్​లో తుదిపోలింగ్ 46.55 శాతం.. ఓల్డ్ మలక్​పేటలో రేపు రీపోలింగ్

By

Published : Dec 2, 2020, 7:36 PM IST

Updated : Dec 3, 2020, 6:13 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ శాతంపై అధికారులు స్పష్టతనిచ్చారు. 149 డివిజన్‌లకు జరిగిన ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఆర్సీపురం డివిజన్ లో 67.71 శాతం పోలింగ్ నమోదైంది. పార్టీల గుర్తులు తారుమారు కావడం వల్ల ఓల్డ్‌ మలక్‌పేట్‌ నేడు రీపోలింగ్‌ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండగా 54,502 మంది ఓటర్లు ఉన్నారు.

నేడు సెలవు...

రీపోలింగ్ నేపథ్యంలో ఓల్డ్ మలక్​పేట డివిజన్​లో సెలవు ప్రకటించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

యూసూఫ్​గూడలో అత్యల్పం...

అత్యల్పంగా యూసూఫ్ గూడ డివిజన్​లో 32.99 శాతం పోలింగ్ నమోదైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి స్పల్పంగా ఓటింగ్‌ పెరిగింది. 2016 ఎన్నికల్లో 45.27 శాతంగా పోలింగ్ జరగగా ఈ సారి 1.28 శాతం పెరుగుదల నమోదైంది.

30 కేంద్రాల్లో...

శుక్రవారం జరిగే బల్దియా ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 30 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు చేపడతారు. లెక్కింపు కోసం 31 మందిని లెక్కింపు పరిశీలకులుగా నియమించారు.

పరిశీలకులు...

ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లను పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉదయం సమావేశం కానుంది. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారి విధుల్లో ఉంచి ఔట్‌పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

అనుమతి లేదు...

ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన కార్వాన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్​ను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ పోరు: మేయర్ పీఠం దక్కేదెవరికి... క్షణక్షణం అప్​డేట్స్ మీకోసం

Last Updated : Dec 3, 2020, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details