తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @3PM - 3PM టాప్​ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3pm topnews
3pm topnews

By

Published : Jun 27, 2022, 2:59 PM IST

  • యశ్వంత్ సిన్హా నామినేషన్​..

విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

  • 'మా అందరి గమ్యం అగ్నిపథ్​'..

కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • సంజయ్​ రౌత్​కు​ ఈడీ సమన్లు..

మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈడీ సమన్లను 'కుట్ర'గా అభివర్ణించారు సంజయ్ రౌత్​.

  • రణరంగంగా పోడురైతుల పాదయాత్ర..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోడు రైతులు తలపెట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. దశాబ్దాల తరబడిగా భూ సమస్యలు పరిష్కరించటం లేదంటూ.. రామన్నగూడెం వాసులు ప్రగతిభవన్​కు బయలుదేరారు. పాదయాత్రగా వెళ్తున్న గ్రామస్థులను పోలీసులు అడ్డుకోవటంతో.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  • అటవీ సిబ్బందితో రైతుల వాగ్వాదం

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బొందలగడ్డ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల విషయంలో రైతులు అటవీశాఖ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. ఆర్​ఎఫ్​ఆర్​ భూముల్లో మొక్కలు నాటేందుకు అధికారులు యత్నించగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునేది లేదని వారు ఎడ్లబండ్లను అడ్డంగా పెట్టారు.

  • గర్భిణిని పట్టించుకోకుండా వైద్యుల పార్టీ..

వైద్యుల నిర్లక్ష్యం.. ఈ లోకాన్ని చూడాల్సిన ఆ పసికందుకు శాపమైంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన ఆ తల్లికి కడుపు కోత మిగిల్చింది. తండ్రికి కన్నీరు మిగిల్చింది. ఈ విషాద ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

  • 'రెండేళ్లలో తెదేపా అధికారంలోకి రావడం పక్కా'

ఏపీలో రెండేళ్లలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని.. ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

  • 'కెప్టెన్​గా రోహిత్ శర్మను​ తప్పించొచ్చు!​'

భారత జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. టీ20 ఫార్మాట్​లో కెప్టెన్​గా రోహిత్​ శర్మను తప్పించొచ్చని అభిప్రాయపడ్డాడు. అందుకు పలు కారణాలను వివరించాడు. అవేంటంటే?

  • ఆ పని సరైన వయసులోనే చేశా!: వైష్ణవ్‌ తేజ్

హాట్ బ్యూటీ కేతికా శర్మతో కలిసి మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా'. ఈ సినిమా టీజర్​ విడుదల అయిన సందర్భంగా అభిమానులతో సరదాగా ముచ్చటించింది చిత్రబృందం. ఇందులో భాగంగా తన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు వైష్ణవ్​. ఆ సంగతులివీ..

  • 'ఆ పాత్ర చేయండి ప్లీజ్​.. రూ.2355కోట్లు ఇస్తాం'​..

'పైరేట్స్​ ఆఫ్​ ది కరీబియన్'​తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జానీ డెప్​ను.. మాజీ భార్య అంబర్​హెర్డ్​ చేసిన ఆరోపణల కారణంగా.. ఆ ఫ్రాంఛైజీ నుంచే తొలగించింది నిర్మాణ సంస్థ డిస్నీ. కానీ, డెప్​ ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవలే తేలిన నేపథ్యంలో తిరిగి అతడిని కెప్టెన్​ జాక్​స్పారోగా నటింపజేసేందుకు రూ.2355కోట్లను డిస్నీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details