రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు, 27 మరణాలు - రాష్ట్రంలో కరోనా కేసులు
18:40 May 18
రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు, 27 మరణాలు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,616 నమూనాలను పరీక్షించగా 3,982 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. తాజాగా మరో 27 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,012కి పెరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ 5,186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 607 మందికి పాజిటివ్‌గా తేలింది. రంగారెడ్డి-262, ఖమ్మం-247, మేడ్చల్ జిల్లాలో 225 మంది వైరస్ బారిన పడ్డారు.