రాష్ట్రంలో కొత్తగా 3,837 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం ఐదున్నర నుంచి బుధవారం సాయంత్రం ఐదున్నర వరకు 71,070 పరీక్ష ఫలితాలు వచ్చాయి. కొత్తగా నమోదైన 3,837 కరోనా కేసులతో కలిపి... రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 5,40,603కు చేరింది. మహమ్మారికి మరో 25మంది బలయ్యారు.
రాష్ట్రంలో కొత్తగా 3,837 కరోనా కేసులు.. 25 మరణాలు
18:44 May 19
రాష్ట్రంలో కొత్తగా 3,837 కరోనా కేసులు.. 25 మరణాలు
రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,037కు చేరింది. కరోనా బారి నుంచి మరో 4,976 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 4,90,620కు చేరింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 86.2 శాతమే ఉండగా.. రాష్ట్రంలో మాత్రం 90.75 శాతం ఉందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 607, రంగారెడ్డిలో 262, మేడ్చల్ జిల్లాలో 225 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం 247, కరీంనగర్ 188 పాజిటీవ్‌లో వెలుగు చూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇవీ చూడండి:కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం