రాష్ట్రంలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి
20:31 May 21
రాష్ట్రంలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి
రాష్ట్రంలో మరో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 26, రంగారెడ్డిలో రెండు కేసులు నిర్ధరణ కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 10 మంది వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వలసజీవుల సంఖ్య 99కి చేరింది. తాజా కేసుల నమోదుతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితులు 1699కు పెరిగారు.
ప్రస్తుతం 618 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 23మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 1036కి పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా రాష్ట్రంలో మరో ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 45కి పెరిగింది.