రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు - తెలంగాణలో కొవిడ్ ప్రభావం
09:18 January 10
రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు బయటపడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 65 మందికి కొవిడ్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2,89,784కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో ఇద్దరు మృతిచెందగా.. ఇప్పటి వరకు 1,565 మంది మృత్యువాత పడ్డారు.
కరోనా నుంచి మరో 415 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,83,463 మంది కొవిడ్ కోరల నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,756 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,584 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇవీచూడండి:జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ షురూ