తెలంగాణ

telangana

ETV Bharat / city

Legal Notice to CRDA: సీఆర్​డీఏకు 28 మంది లీగల్ నోటీసులు... ఎందుకంటే?

Legal Notice to CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై సీఆర్​డీఏకు 28 మంది లీగల్ నోటీసులు ఇచ్చారు. ఒప్పందం మేరకు ఫ్లాట్లు అప్పగించనందున... చెల్లించిన 10 శాతం సొమ్మును 14 శాతం వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొన్నారు. 20 లక్షల పరిహారం ఇవ్వాలని... లేదంటే రెరా చట్టం కింద కేసు వేస్తామని హెచ్చరించారు.

Legal Notice to CRDA
Legal Notice to CRDA

By

Published : Feb 23, 2022, 7:40 PM IST

Legal Notice to CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై.. సీఆర్డీఏకు 28 మంది లీగల్ నోటీసులు పంపించారు. 2021 డిసెంబర్ 31 నాటికి ప్లాట్లు అందజేయాలని ఒప్పందం జరిగిందని.. గడువు తీరినప్పటికీ ఫ్లాట్లు అప్పగించకపోవటంతో.. చెల్లించిన 10శాతం సొమ్మును 14శాతం వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో కోరారు. అలాగే 20 లక్షల పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. లేదంటే రెరా సీఆర్డీఏపై చట్టం కింద కేసు వేస్తామంటుని హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ ద్వారా.. సీఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపించారు.

2018లో సీఆర్డీఏ ద్వారా హ్యాపీనెస్ట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిర్మించే 12 టవర్లలో 1200 ఫ్లాట్లు కడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో హ్యాపీనెస్ట్ ఫ్లాట్లన్నీ గంటలోనే అమ్ముడయ్యాయి. సీఆర్డీఏ ఒప్పందం మేరకు తొలి వాయిదాగా కొనుగోలుదారులు 10 శాతం సొమ్ము చెల్లించారు.

ఇదీ చదవండి:ఆ వివాదాలపై మీ వైఖరేంటి.. రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details