ఏపీలో గడిచిన 24 గంటల్లో 86,280 పరీక్షలు నిర్వహించగా.. 2,527 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,43,854 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 19 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,197కి చేరింది.
Corona Cases: ఏపీలో 2,527 కొత్త కేసులు... 19 మంది మృతి - AP CORONA CASES
ఏపీలో కొత్తగా 2,527 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల 19 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు కోలుకున్నారు.
2527-new-more-corona-cases-reported-in-andhrapradesh
24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,06,718కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 23,939 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరులో జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.