తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు - undefined

ts corona
ts corona

By

Published : Aug 22, 2020, 8:41 AM IST

Updated : Aug 22, 2020, 10:07 AM IST

08:40 August 22

రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా నమోదైన కేసులతో బాధితుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో 43,095 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2,474 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో బాధితుల సంఖ్య 1,01,865కు చేరింది. కొత్తగా ఏడుగురు కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 744కు చేరింది.  

రాష్ట్రంలో ప్రస్తుతం 22,386 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇంకా 12,039 నమునాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు 8,91,173 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 15,931 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. తాజాగా జీహెచ్​ఎంసీ పరిధిలో 447,  రంగారెడ్డిలో 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  

ప్రభుత్వాసుపత్రుల పరిధిలో ఆక్సిజన్‌, ఐసీయూ, సాధారణ పడకలు కలిపి 18,007 ఖాళీగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 74.30శాతం ఉండగా.. రాష్ట్రంలో 77.29 ఉందని పేర్కొంది. దేశంలో వైరస్‌ మరణాల రేటు 1.89శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.73శాతంగా ఉందని స్పష్టం చేసింది. 21 నుంచి 40ఏళ్ల వయసున్న వారిలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయని వెల్లడించింది. 

Last Updated : Aug 22, 2020, 10:07 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details