ఏపీలో కొత్తగా 22,164 కరోనా కేసులు, 92 మరణాలు - ఏపీ కరోనా కేసుల తాజా వార్తలు
ఏపీపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనాలు ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు.
corona cases in ap
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22,164 కరోనా కేసులు, 92 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 18,832 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,90,632 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 1,05,494 కరోనా పరీక్షలు చేశారు.