తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంటర్‌ పరీక్షలకు 22,210 మంది గైర్హాజరు.. సిద్దిపేటలోనే అధికం..! - intermediate exams in Telangana

Intermediate Exams 2022 : రాష్ట్రంలో శుక్రవారం రోజున ప్రారంభమైన ఇంటర్​ ప్రథమ సంవత్సర పరీక్షలు.. ప్రశాంతంగా జరిగాయి. కాకపోతే.. ఈ పరీక్షలకు 22, 210 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో.. సిద్దిపేట జిల్లాలోనే 7.50 శాతం పరీక్షరాయకపోవటం గమనార్హం.

22-thousand-students-absent-to-inter-first-year-exams
22-thousand-students-absent-to-inter-first-year-exams

By

Published : May 7, 2022, 8:14 AM IST

Intermediate Exams 2022 : ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 22,210 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. వారిలో పదుల మంది ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా రావడంతో పరీక్షలు రాయలేకపోయారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్‌ తదితర ద్వితీయ భాషల పరీక్షలకు మొత్తం 4,64,756 మంది హాజరవ్వాల్సి ఉండగా.. 4,42,546 మంది(95.30) శాతం వచ్చారు. అంటే రాష్ట్రవ్యాష్తంగా సగటున 4.70 శాతం గైర్హాజరయ్యారు.

Intermediate Exams in Telangana 2022 : సిద్దిపేట జిల్లాలో అది 7.50 శాతం ఉండటం గమనార్హం. నిజామాబాద్‌ జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదైందని ఇంటర్‌బోర్డు తెలిపింది. బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ హైదరాబాద్‌లోని పలు కళాశాలలను సందర్శించారు. నాంపల్లిలోని ఎంఏఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తాగునీటిని అందుబాటులో ఉంచకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించనందుకు అక్కడ చీఫ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న దుర్గను పరీక్షల విధుల నుంచి కలెక్టర్‌ శర్మన్‌ తొలగించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల పరీక్ష కేంద్రాల వద్ద వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details