ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 154 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
ఏపీలో మరో 154 మందికి కరోనా.. 4,813కి చేరిన కేసుల సంఖ్య - covid 19 cases in ap
ఏపీలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మెుత్తం మృతుల సంఖ్య 75కి చేరింది.
ap corona
మొత్తం కేసుల సంఖ్య 4,813కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు 28 ఉండగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ఒక్క కేసు నమోదయ్యింది. తాజాగా 34 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,387కి చేరింది. ఇప్పటి వరకూ 75 మంది ప్రాణాలు కోల్పోయారు.