telangana commercial tax revenue : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రాబడి వృద్ధిరేటు.. గత ఏడాది కంటే 15 శాతం అధికంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జులై నెలాఖరు వరకు 22 వేల 657 కోట్లు ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే ఈసారి 2 వేల 891 కోట్లు అధికంగా రాబడి వచ్చింది. ఈ ఆర్థిక ఏడాది వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 69 వేల 203 కోట్లు రాబడిని అంచనా వేయగా... జులై నెలాఖరు వరకు 22 వేల 657 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఖజానాకు కీలక ఆదాయం వాణిజ్య పన్నులశాఖ ద్వారానే సమకూరుతోంది. ప్రధానంగా జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకం పన్ను ద్వారా ఆదాయం వస్తోంది.
వాణిజ్య పన్నుల రాబడిలో 15 శాతం పెరుగుదల - తెలంగాణ వాణిజ్య పన్నుల రాబడి
telangana commercial tax revenue రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ రాబడిలో 15 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జులై వరకు రూ.22,656 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే కాలానికి వచ్చిన రూ.19,765 కోట్లతో పోలిస్తే.. ప్రస్తుతం రూ.2,891 కోట్లు అధిక రాబడి నమోదైంది.
జీఎస్టీ రాబడి 41 శాతం పెరిగింది. గత ఏడాది మొదటి నాలుగు నెలల్లో 8 వేల 545 కోట్లు రాగా.... ఈసారి 12 వేల 35 కోట్లు వచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను ఆదాయం 42 శాతం పెరిగింది. ఈ ఆదాయం ప్రతి నెలా పెరుగుతోంది. జులైలో అత్యధికంగా రూ.1400 కోట్ల అమ్మకం పన్ను రాబడి నమోదైంది. మద్యం అమ్మకం పన్ను రాబడి 17 శాతం పెరిగింది. ప్రతి నెలా సగటున రూ.1200 కోట్ల వరకు మద్యం అమ్మకం పన్ను ఆదాయం వస్తోంది. జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకాల పన్ను ద్వారా... రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఇదే జోరు రాబోయే 8నెలలు కొనసాగితే బడ్జెట్ లక్ష్యాల్ని సులువుగా చేరుకుంటామని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.