తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 14 వేలకు పైగా కేసులు - ఏపీలో విజృంభిస్తున్న కరోనా

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విలాయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 14,669 కొవిడ్​ కేసులు నమోదు కాగా... కరోనాతో 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ap latest corona cases
ఏపీలో కరోనా విజృంభణ

By

Published : Apr 28, 2021, 6:12 PM IST

ఏపీలో రోజురోజుకీ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం అధికంగా ఉంటోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీ వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా... 14,669 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

కరోనాతో బాధపడుతూ 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం ఇప్పటి వరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే... 10,69,544 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

ఇదీ చదవండి:ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్

ABOUT THE AUTHOR

...view details