ఏపీలో కరోనా పట్టపగ్గాల్లేకుండా వ్యాపిస్తోంది. కొత్తగా 10,794 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 4,98,125కు పెరిగింది. ఒక్కరోజులో 11,915 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3,94,019 మంది డిశ్చార్జయ్యారు. కొత్తగా 70 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 4,417 మంది మరణించారు. ఒక్కరోజులో 72,573 శాంపిళ్లను పరీక్షించగా.... 14.83 శాతం కేసులు వెలుగుచూశాయి.
ఏపీలో వరుసగా 11వ రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు - ఏపీలో కరోనా వైరస్ వార్తలు
17:28 September 06
ఏపీలో వరుసగా 11వ రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు
నెల్లూరులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం వెయ్యకేసులతో రాష్ట్రంలో అగ్రభాగాన నిలుస్తున్న తూర్పుగోదావరిని వెనక్కి నెట్టింది. కొత్తగా 1,299 కేసుల నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 37,278కి చేరింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 30,263 మంది డిశ్చార్జయ్యారు.
తూర్పుగోదావరిలో 1,244 మందికి వైరస్ సోకింది. బాధితుల సంఖ్య 66,948కి పెరిగింది. వారిలో 52,067 మంది కోలుకున్నారు. జిల్లాలో మరణాల సంఖ్య.... 427గా ఉంది. పశ్చిమగోదావరిలో మరోసారి వెయ్యికి పైగా కేసులు వెలుగుచూశాయి. కొత్తగా 1,101 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 42,903కి చేరింది. అందులో 39,718 మంది కోలుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా నమోదైన 1,042 కేసులతో... బాధితుల సంఖ్య 29,74కు పెరిగింది.
చిత్తూరు జిల్లాలో కొత్తగా 927 కేసులు నమోదు కాగా... బాధితుల సంఖ్య 42,561కి పెరిగింది. కొత్తగా కడప జిల్లాలో 904, శ్రీకాకుళం జిల్లా 818, గుంటూరు జిల్లా 703, విజయనగరం జిల్లాలో 593, విశాఖ జిల్లా 573, కృష్ణా 457, కర్నూలు జిల్లాలో 457 చొప్పున కేసులు వెలుగూచూశాయి.