'ఈఎస్ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగింది' ఈఎస్ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐలో మందుల గోల్మాల్పై గత ఐదు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏసీబీ విచారణ చేయించి ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు ఏడుగురిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేవలం రూ.11 కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులంటున్నారని.. భారీ స్థాయిలో కుంభకోణం జరిగి, వందల కోట్ల నిధులు గల్లంతయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు.