తెలంగాణ

telangana

ETV Bharat / city

లోక్​ సమరానికి మేం రె'ఢీ' - pm

పార్లమెంట్​ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తెరాసకు, కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని ఓటర్లకు సూచించారు. కమలం నేతలు హైదరాబాద్​లో​ బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించారు.

బీసీల ఆత్మ గౌరవ సభ

By

Published : Mar 11, 2019, 5:57 AM IST

Updated : Mar 11, 2019, 7:13 AM IST

లోక్​సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో కేశవ్​ మెమోరియల్ కాలేజ్ మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభను నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కిషన్​రెడ్డి, రాంచందర్​రావు హాజరయ్యారు. రెండు సార్లు బీసీల ఓట్లతో గెలిచిన తెరాస సర్కార్ 33 శాతం ఉన్న రిజర్వేషన్లను 23శాతానికి తగ్గించిందని లక్ష్మణ్ మండిపడ్డారు. కేటీఆర్ పట్టపగ్గాలు లేకుండా మాట్లాడుతున్నారని కిషన్​రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి సంబంధించినవి కావని దేశానికి సంబంధించినవన్నారు. రాహుల్ గాంధీ పిచ్చిపిల్లాడిలా మాట్లాడుతున్నాడని ఎంపీ బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలందరూ ఏకమైనా నరేంద్రమోదీ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

బీసీల ఆత్మ గౌరవ సభ

ఇవీ చూడండి:సాహసమే ఊపిరిగా..

Last Updated : Mar 11, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details