తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆరుగంటల పాటు సాగిన విచారణ - vote for note

ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్​రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన అధికారులు నరేందర్​రెడ్డితో పాటు ఆయన కుమారుడిని ప్రశ్నించారు.  వారం  రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని రేవంత్​రెడ్డికి ఈడీ నోటిసులు పంపింది.

ఈడీ ఎదుట హాజరైన వేం నరేందర్​ రెడ్డి

By

Published : Feb 12, 2019, 8:03 PM IST

కేసులు ఎదుర్కోవడానికి సిద్ధం
ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ నేత వేం నరేందర్‌ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నరేందర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు కృష్ణకీర్తన్​రెడ్డిని కూడా 6 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ ఈడీ తమను ఎందుకు విచారిస్తుందో అర్థం కావట్లేదని నరేందర్​రెడ్డి అన్నారు. కేసులు ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనతో పాటు తమ కుటుంబసభ్యులను కూడా పిలిచి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు.

రేవంత్​కు నోటీసులు

మరోవైపు ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని వారం రోజుల్లో తమ ముందు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details