తెలంగాణ

telangana

ETV Bharat / city

టీఎన్జీవో క్రీడలు - రవీందర్​ రెడ్డి

హైదరాబాద్​లో టీఎన్జీవో మహిళా​ విభాగం క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

పరుగు పెడుతున్న మహిళా ఉద్యోగులు

By

Published : Feb 27, 2019, 6:21 PM IST

టీఎన్జీవో క్రీడలు
టీఎన్జీవో మహిళా విభాగం క్రీడా పోటీలు హైదరాబాద్​లో ప్రారంభం అయ్యాయి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎల్బీ స్టేడియంలో రెండు రోజుల పాటు పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడలను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి ప్రారంభించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యం పని ఒత్తిడితోపాటు కుటుంబ పోషణతో సతమతం అవుతున్న మహిళా ఉద్యోగులకు... క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కారెం రవీందర్ రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:నిమిషం విషం

ABOUT THE AUTHOR

...view details