తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈవీఎంలపై అధికారులకు అవగాహన - lok sabha elections

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా..ఈసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.జిల్లా కలెక్టర్లు, రిటర్నింట్ అధికారులకు ఇతర రాష్ట్రాలకు చెందిన అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై అవగాహన

By

Published : Feb 14, 2019, 11:32 PM IST

ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై అవగాహన
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. పోలింగ్ ప్రక్రియలో మరింత మెరుగ్గా వ్యవహరించేందుకు జిల్లా కలెక్టర్లు, రిటర్నింట్ అధికారులకు ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనుభవజ్ఞులైన అధికారులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రధానంగా వీవీప్యాట్‌ల లెక్కింపు, రీకౌంటింగ్ ఏ పరిస్థితుల్లో జరపొచ్చో వివరించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా... ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details