తెలంగాణ

telangana

ETV Bharat / city

రాచకొండ కొత్త కమిషనరేట్ - కొత్త కమిషనరేట్​

పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌళిక వసతులు సమకూర్చుకుని నేరాలను అదుపు చేయడానికి కృషి చేస్తోంది.

ప్రారంభించిన హోమంత్రి

By

Published : Feb 17, 2019, 1:20 PM IST

Updated : Feb 17, 2019, 3:09 PM IST

కమిషనరేట్​ నూతన భవనం ప్రారంభం
మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​లో రాచకొండ కొత్త కమిషనరేట్​ను హోంమంత్రి మహమూద్​ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్​ రెడ్డి, పోలీస్​ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోనే ఉత్తమ పోలీసు వ్యవస్థగా హైదరాబాద్​ పోలీసులకు పేరుందని హోంమంత్రి ప్రశంసించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ ద్వారా ప్రజలకు చేరువవుతున్నట్లు చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా తెలంగాణ పోలీసు వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి సంకల్పించినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి తెలిపారు. సాంకేతికతతో ప్రజలకు మరింత చేరువయ్యామని అన్నారు. పౌరుల సహకారంతో భాగ్యనగరాన్ని నేర రహితంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
Last Updated : Feb 17, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details