ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్ర అధికారులతో కేంద్ర ఎన్నికల బృందం భేటీ - కేంద్ర ఎన్నికల సంఘం

రాష్ట్ర అధికారులతో  కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయ్యింది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణ అంశాలపై హైదరాబాద్​లోని తాజ్​కృష్ణ హోటల్​లో సమావేశమై చర్చించారు.

ఎన్నికల అధికారులు
author img

By

Published : Apr 2, 2019, 6:11 AM IST

Updated : Apr 2, 2019, 7:10 AM IST

రాష్ట్ర అధికారులతో సమావేశమైన సీఈసీ అధికారులు
హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని​ తాజ్​కృష్ణలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఉమేష్​ సిన్హా నేతృత్వంలోని బృందం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా నిజామాబాద్​ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అంశంపై సమాలోచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​, సీపీ అంజనీకుమార్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​, హైదరాబాద్​ కలెక్టర్​ మాణిక్​రాజ్​ పాల్గొన్నారు.
Last Updated : Apr 2, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details