ఫిబ్రవరి17న నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించిన గద్వాల పోలీసులకు కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి. 16న డబ్బులు తీసుకొచ్చేందుకు వెళ్తున్నానని శ్రీనివాసులు తన భార్య సుజాతకు చెప్పి ఏపీలోని మార్కాపురం వెళ్లాడు. 17న ఫోన్ చేసి ఎవరో తనను కొడుతున్నారని చెప్పి కట్ చేశాడు. భయపడ్డ సుజాత మళ్లీ ఫోన్ చేయగా మీ భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డోన్ రైల్వే స్టేషన్లో కొడుతున్నారని చెప్పి స్విఛాఫ్ చేశారు. సుజాతకు అనుమానం వచ్చి గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
ఇంట్లో తెలిసిందని చంపేసింది..!
ప్రకాశం జిల్లామార్కాపురానికి చెందిన స్వాతి, భర్త రమణారెడ్డి హైదరాబాదులో నివాసం ఉండేవారు. స్వాతి తన తల్లిదండ్రులను చూసేందుకు తరచూ గుంటూరు ప్యాసింజర్లో ప్రయాణం చేసేది. వ్యాపార నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్న శ్రీనివాసులుకు ఓసారి రైలులో సీటిచ్చింది.ఆపరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇంతటితో ఆగకుండా శ్రీనివాసులు పెళ్లి చేసుకుందామని స్వాతిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అప్పటికే పెళ్లయిన స్వాతికిఏమాత్రం ఇష్టంలేదు. శ్రీనివాసులుని అడ్డు తొలిగించుకునేందుకు తండ్రి, తమ్ముడితో కలిసిపథకం రచించింది.