ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిక్యతను సాధించాలనే లక్ష్యంతో తెరాస అధిష్ఠానం పావులు కదుపుతోంది. నిర్మల్ జడ్పీ కైవసం చేసుకునే బాధ్యతను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ దక్కించుకునే బాధ్యత మాజీ మంత్రి జోగు రామన్నకు అప్పగించింది.
మంత్రి ఇంద్రకరణ్ సుడిగాలి పర్యటనలు
నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుంటే... జడ్పీ పాలన పగ్గాలు చేపట్టాలంటే పది స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి... ఇప్పటికే జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ బాధ్యతలను తెరాస మాజీ మంత్రి జోగు రామన్నకు తెరాస అప్పగించింది. 17 జడ్పీటీసీ స్థానాలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో తెరాస కనీసం తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోవాల్సి ఉంది.