ఆరాధ్య దేవతకు నైవేథ్యం సమర్పించిన ఆదివాసీలు - Anavaiti culture in adilabad
కొండప్రాంతాల్లో నివసించే మెస్రం వంశీయులు... ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో దేవతలకు నేవేథ్యం సమర్పించారు. నూతన సిరిపంటలతో ఆరాధ్య దైవానికి నైవేథ్యం పెట్టడం ఆదివాసీలకు అనవాయితీ.
ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రలోని కిన్వాట్ ప్రాంతాల్లోని కొండాకోనల్లో నివసించే మెస్రం వంశీయులు.. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా వాళ్లు నూతనంగా పండించిన పంటను తీసుకొచ్చి వారి సంప్రదాయబద్దంగా నైవేథ్యం చేసి నాగోబా దేవతకు సమర్పించారు. ఈ సారి రాఖీ పౌర్ణమి కలిసి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ... మొక్కులు తీర్చుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
TAGGED:
Anavaiti for tribals