Food Poison: అల్పాహారం వికటించి 43 మంది బాలికలకు అస్వస్థత - students hospitalized
13:07 March 09
Food Poison: అల్పాహారం వికటించి 43 మంది బాలికలకు అస్వస్థత
Food Poison: ఆదిలాబాద్ గ్రామీణ కస్తూర్భా గాంధీ పాఠశాలలో అల్పాహారం వికటించి 43 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో కస్తూర్భా పాఠశాల కొనసాగుతోంది. ఉదయం అల్పాహరంలో ఇడ్లీ, చట్నీ తిన్న బాలికలు.. కాసేపటికే వరుసగా ఒక్కొక్కరు వాంతులు చేసుకోవటం ప్రారంభించారు. ఈ విషయం కాస్తా బయటికి తెలియటంతో.. మీడియా బృందం పాఠశాలకు చేరుకుంది. అప్పటివరకు బాలికలు పాఠశాలలోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఆ తర్వాతే ఆటోలు, మీడియా వాహనాలపై విద్యార్థులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈవో ప్రణీత ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితిని డైరెక్టర్ జై సింగ్‌ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: