తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆన్​లైన్​లో సెల్​ఫోన్ ఆర్డర్... పార్శిల్​లో వచ్చింది చూసి షాక్! - సెల్​ఫోన్​కి బదులు సబ్బు

ఆన్​లైన్​ షాపింగ్​లో అప్పుడప్పుడు ఖరీదైన వస్తువులు కొంటే రాళ్లు, సబ్బులు, ఇతర వస్తువులు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఆదిలాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యువకుడు ఈ-కామర్స్ సైట్‌లో ఎంతో ఇష్టంగా సెల్​ఫోన్​ ఆర్డర్ చేశారు. పార్శిల్​ రాగానే ఎంతో ఆనందంగా తెరిచారు. ప్యాక్​ తెరిచిచూస్తే అందులో వచ్చింది చూసి ఆశ్యర్యానికి గురయ్యాడు. ఇంతకీ అందులో ఏం వచ్చిందనుకుంటున్నారా..

Soap came when ordering a phone
Soap came when ordering a phone

By

Published : Jun 6, 2022, 11:10 AM IST

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు సాంకేతిక టెక్నాలజీకి అలవాటుపడుతున్నారు. చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి ప్రతీది ఆన్​లైన్​లో ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని కంపెనీలు ఇటీవల కాలంలో అప్పుడప్పుడు ఒకదానికి బదులుగా మరొకటి పంపుతున్నాయి. ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేస్తే రాళ్లు, సబ్బులు, ఇతర వస్తువులు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో చోటుచేసుకుంది.

ఫోన్​ ఆర్డర్ చేస్తే వచ్చిన సబ్బును చూపిస్తున్న యువకుడు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని బోయవాడలో నివాసం ఉంటున్న పందిరి భీమన్న ఐదు రోజుల కిందట తనకు ఇష్టమైన చరవాణిని ఈ-కామర్స్ సైట్‌లో ఆర్డర్‌ చేశారు... పార్శిల్‌ రాగానే ఎంతో ఆనందంగా తెరిచారు. ప్యాక్‌ తెరిచిచూడగానే అవాక్కయ్యారు. అందులో ఫోన్‌కు బదులుగా రిన్‌సబ్బు వచ్చింది. ఇటీవల ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ముందుగా జాగ్రత్తగా వీడియో తీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. మోసపోయిన తనను ఆదుకోవాలని.. కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి:గూగుల్‌ పేలో చెల్లింపు.. వాట్సాప్‌లో బోగస్‌ ప్రతులు..!

ABOUT THE AUTHOR

...view details