Red Cross Society Land Issue : ఆదిలాబాద్ నడిబొడ్డున ఉండే పాతహౌసింగ్ బోర్డు కాలనీలో 2015లో అప్పటి కలెక్టర్ జగన్మోహన్.. రెడ్‌క్రాస్ సొసైటీకి నాలుగు గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించారు. అధికారికంగా ప్రొసీడింగ్‌తో కూడిన పత్రాలు జారీచేశారు. అదే ఏడాది సోసైటీ భవన నిర్మాణానికి భూమి పూజచేశారు. నిధులలేమి వల్ల భవన నిర్మాణం జరగలేదు. రెడ్‌క్రాస్ సోసైటీ ఏడాదికోసారి నిర్వహించే కార్యక్రమాలకు ఆ స్థలం వేదికగా నిలుస్తోంది. మిగతా సమయాల్లో ఖాళీగా ఉంటోంది.
Red Cross Society Land Issue in Adilabad : ఇదే అదనుగా భావించిన పురపాలక సంఘంలోని ఓ ద్వితీయ స్థాయినేత మున్సిపాలిటీ ద్వారా ఆ స్థలానికి ఇంటి నెంబర్ ఇప్పించి ఇంటిపన్ను చెల్లిస్తున్నట్లు రసీదులు సృష్టించాడు. వాటి ఆధారంగా రెండు నెలల క్రితం రెడ్‌క్రాస్ సొసైటీ భూమిని బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. తాజాగా ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించడంతో విషయం బయటపడింది. అక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గంగేశ్వర్ తెలిపారు.
Red Cross Society Land Kabza in Adilabad : "2015లో అప్పటి ఆదిలాబాద్ కలెక్టర్ జగన్మోహన్.. రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత భవనం నిర్మణానికి నాలుగు గుంటల స్థలం ఇచ్చారు. రెవెన్యూ భూముల్లో నుంచి ఈ స్థలాన్ని మా సొసైటీ కోసం కేటాయించారు. అప్పట్నుంచి ఈ భూమిలో మా సొసైటీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నాం. భవన నిర్మాణానికి నిధులు సమకూరకపోవడం వల్ల ఈ స్థలంలో ఇంకా నిర్మాణం చేపట్టలేదు. వసీం కోకర్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు చూపించి ఈ భూమి తనదని అన్నారు. ఈ స్థలాన్ని వదిలి వెళ్లకపోతే సొసైటీ భూములు లాక్కుంటామని బెదిరించారు."
- గంగేశ్వర్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు
"నెల క్రితం.. ఈ భూమిలో ఓ గుడిసె ఉన్నట్లు.. దాన్ని కూల్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇది భూ మాఫియా కేసు అని కచ్చితంగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ స్వయంగా కేటాయించిన భూమే కబ్జాకు గురవుతోందంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు."