తెలంగాణ

telangana

ETV Bharat / city

పంచాయతీ కార్యదర్శులకు 'ఉపాధి' బాధ్యత - 'ఉపాధి' పనులను పర్యవేక్షించనున్న పంచాయతీ కార్యదర్శులు

ఉపాధి పనుల బాధ్యతను గ్రామాల్లో ఇకనుంచి పంచాయతీ కార్యదర్శులు తీసుకోనున్నారు. ఆగస్టు 5న ఉపాధి పనుల నిర్వహణ విషయమై మండలాల వారీగా ఒక రోజు శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమను విధుల్లో తీసుకుంటారనే ఆశతో ఉన్న క్షేత్రసహాయకులను విధుల నుంచి పూర్తిగా తప్పించినట్లయింది.

employment gurantee inspection at villages handedover to panchayat karyadarshulu
'ఉపాధి' పనులను పర్యవేక్షించనున్న పంచాయతీ కార్యదర్శులు

By

Published : Aug 3, 2020, 1:46 PM IST

పల్లెల్లో ఉపాధి పనుల బాధ్యతను ఇక నుంచి పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించనున్నారు. ఇన్నాళ్లు వీటిని చూసిన క్షేత్రసహాయకుల (ఫీల్డ్‌ అసిస్టెంట్‌)ను ప్రభుత్వం ఇటీవల విధుల నుంచి తొలగించింది. దీంతో ఉపాధి పనులను చూసే బాధ్యతలను ఆయా గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. 5న ఉపాధి పనుల నిర్వహణ విషయమై మండలాల వారీగా ఒక రోజు శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమను విధుల్లో తీసుకుంటారనే ఆశతో ఉన్న క్షేత్రసహాయకులను విధుల నుంచి పూర్తిగా తప్పించినట్లయింది.

గ్రామీణులకు ఉపాధి కల్పిస్తూ పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలకంగా మారింది. ఈ పథకం కింద ఏటా రూ.కోట్ల నిధులు విడుదలవుతుంటాయి. మట్టి కట్టలు, పంట కాల్వలు, సేద్యపు కుంటలు, నీటి నిల్వ కుంటలు, కాల్వల మళ్లింపు, చెరువుల పూడికతీత, మొక్కలు నాటడం, నర్సరీల నిర్వహణ, పశువుల పాకలు, పంట కల్లాల నిర్మాణం, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులతోపాటు 52 రకాల పనులను ‘ఉపాధి’ కూలీల ద్వారానే చేపడుతున్నారు.

వీటిని రోజువారీగా పర్యవేక్షించేందుకు పంచాయతీల వారీగా క్షేత్రసహాయకులను నియమించింది. ఇలా పాత పంచాయతీల వారీగా జిల్లాలో 230 మంది పనిచేసేవారు. వీరికి ప్రత్యేకంగా నెలనెలా వేతనం అందించింది. డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వీరు సమ్మెకు వెళ్లడంతో ప్రభుత్వం వీరిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలికంగా ఈ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. తాజాగా వీరికే పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

జిల్లాలో ప్రస్తుతం 467 పంచాయతీలు ఉండటంతో ఒక్కో దానికి ఒక్కో కార్యదర్శిని ప్రత్యేకంగా నియమించింది. దీంతో గ్రామాల్లో పనుల పర్యవేక్షణ సులభతరంగా మారింది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణతో పాటు దస్త్రాల నిర్వహణ, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృధ్ధి పనులును పర్యవేక్షిస్తున్నారు.

వీరికి అదనంగా ఉపాధి పనులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5న మండలాలవారీగా ఎంపీడీఓలు, ఏపీఓల ద్వారా ఉపాధి పనుల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తదనంతరం పంచాయతీ విధులతో పాటు ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న పనులన్నింటినీ వీరే చూసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులైనందున బాధ్యతాయుతంగా ఉంటారనే ఉద్దేశంతో వీరికి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి రాఠోడ్‌ రాజేశ్వర్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ఉపాధి పనులను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించిందని తెలిపారు. వీరికి ఒక రోజు ఆయా పనుల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details