ఆదిలాబాద్‌లో సాదాసీదాగా క్రీడాదినోత్సవాలు - adilabad news
ఆదిలాబాద్‌లో జాతీయ క్రీడాదినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించారు. ద్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులు అర్పించారు. ద్యాన్‌చంద్ సేవలను అధికారులు గుర్తుచేసుకున్నారు.
national sports day celebrations in adilabad
హాకీ మాంత్రికుడు ద్యాన్‌జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని మైదానంలో జాతీయ క్రీడాదినోత్సవం నిర్వహించారు. కరోనా దృష్ట్యా సాదాసీదాగా వేడుకలు జరిపారు. ద్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులు అర్పించారు. డీఎస్‌డీఓ వెంకటేశ్వర్లు, ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.గోవర్దన్‌రెడ్డి, గిరిజన విద్యా వ్యాయమ అధికారి పార్థసారథి తదితరులు పాల్గొని ద్యాన్‌చంద్ సేవలను గుర్తుచేసుకున్నారు.