రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ముస్లి టోపీ ధరించిన సన్నివేశం అభ్యంతరకరంగా ఉందని.. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని కొమురం భీం యువసేన జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సినిమాలోంచి ఆ సన్నివేశాన్ని తొలిగించాలని డిమాండ్ చేశారు.
ఇస్లాం టోపీ ఉన్న సన్నివేశాన్ని తొలిగించాలి : కొమురం భీం యువసేన
రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురంభీం పాత్రలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇస్లాం మతానికి చెందిన టోపీ ధరించి ఉన్న దృశ్యాన్ని తొలిగించాలని కొమురం భీం యువసేన ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఆ సన్నివేశం తొలగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఇస్లాం టోపీ ఉన్న సన్నివేశాన్ని తొలగించాలి : కొమురం భీం యువసేన
ఉట్నూరు మండల కేంద్రంలోని కొమురం భీం ప్రాంగణంలో భీం విగ్రహానికి పాలాభిషేకం చేసి.. పూలమాల సమర్పించారు. కొమురం భీం చరిత్ర తెలియకుండా సినిమా తీస్తే బాగుండదని.. ఆయనను అవమానిస్తూ.. చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తే చూస్తూ ఊరుకోం అని జిల్లా నాయకులు పెద్దూరు ప్రభాకర్, ఆడ హనుమంతరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: విపత్తుల కల్లోలం.. పర్యావరణ పరిరక్షణ అత్యావశ్యకం