UPI Lite Limit Increase :ఇంటర్నెట్ లేకుండా చిన్న మొత్తాలను చెల్లిచేందుకు తీసుకువచ్చిన యూపీఐ లైట్లో కీలక మార్పులు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.చెల్లింపుల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.500 వరకు పెంచింది. ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా, అసలు లేని ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు పెంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉపయోగించి ఆఫ్‌లైన్ మోడ్‌లోనే రోజుకు రూ.2వేల వరకు చెల్లింపులు చేయవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం యూపీఐ లైట్లో నెలకు కోటి లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
యూపీఐ లైట్ వ్యాలెట్..
Upi Lite Without Internet :పేటీఎం, మొబీక్విక్ వంటి ఆన్డివైజ్ వ్యాలెట్ల తరహాలోనే యూపీఐ లైట్ వ్యాలెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎన్పీసీఐ ప్రకటించింది. దీన్ని ఉపయోగించి వినియోగదారులు చిన్న మొత్తంలో లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్‌లో ఫండ్స్‌ను కూడా స్టోర్ చేసుకునే సదుపాయాన్ని ఎన్పీసీఐ కల్పిస్తుంది.
ఇది ఎలా పనిచేస్తుండంటే..
UPI Lite Works Offline :యూపీఐ లైట్ వ్యాలెట్.. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో 'నియర్ ఆఫ్‌లైన్ మోడ్'లో పనిచేస్తుందని ఎన్పీసీఐ వెల్లడించింది. డెబిట్ పేమెంట్స్ ఆఫ్‌లైన్‌లో, క్రెడిట్ పేమెంట్స్ ఆన్లైన్లో జరుగుతాయి. యూజర్ ఆన్‌లైన్‌లోకి వచ్చాక క్రెడిట్ పేమెంట్స్ అప్డేట్ అవుతాయి. అయితే క్రమంగా అన్ని రకాల చెల్లింపులూ ఆఫ్‌లైన్‌కు వచ్చేలా కృషి చేస్తామని ఎన్పీసీఐపేర్కొంది. ఈ యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఉండే నగదుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదని ప్రారంభ సమయంలో ఆర్బీఐ స్పష్టం చేసింది. యూపీఐ లైట్ ఖాతాల సంఖ్య యూజర్లు వాడే యూపీఐ యాప్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.