Upcoming Cars In India October 2023 :రానున్న రోజుల్లో మన దేశంలో పండగ వాతావరణం నెలకొననుంది. ఈ సమయాల్లో చాలా మంది కొత్త కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి పలు కంపెనీలు. మరి రానున్న రోజుల్లో విడుదలయ్యే కార్లు, వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్..
Tata Harrier facelift :ఈ కారుకు టీజర్‌ను వారం క్రితమే వారమే విడుదల చేసింది టాటా కంపెనీ. కాగా కొద్ది రోజుల్లోనే ఈ హారియర్ ఫెస్‌లిఫ్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. మొత్తం ఏడు కలర్లు, పది వేరియంట్లలో టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉంది. 168 bhp పవర్‌తో 150Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది ఈ కారు. ఇందులో మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్ల సౌకర్యం ఉంది. దీంట్లో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. దీని ధర రూ.15 నుంచి 22లక్షలు ఉండే అవకాశం ఉంది.
టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్..
Tata Safari Facelift :సఫారీ కారును కూడా అక్టోబర్ నెలలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా కంపెనీ. 2.0 టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. 170 పీఎస్‌తో 350 టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ధర రూ.16 నుంచి రూ.2లక్షలు ఉండనుంది.
మహింద్రా బొలెరో నియో ప్లస్..
Mahindra Bolero Neo Plus :మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి ఆరంగ్రేటం చేయనుంది ఈ కారు. 2.2 డీజిల్ ఇంజిన్ సామర్థ్యంతో ఈ వెహికల్ తయారైంది. దీని ధర దాదాపు రూ.10లక్షలు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఆరు మాన్యువల్ గేర్ల సౌకర్యం ఉంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్..
Toyota Urban Cruiser Taisor :మరికొద్ది వారాల్లోనే ఈ కారు వినియోగదారుల ముందుకు రానుంది. దీని ధర దాదాపు రూ.12 నుంచి రూ.16 లక్షల మధ్య ఉండనుంది. 103bhpతో 138nm టార్క్‌ను టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ కారు జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్, ఆటోమెటిక్ గేర్ల సౌకర్యం ఈ కారులో ఉన్నాయి.