Top 5 Most Affordable Petrol Scooters under Rs 1 Lakh : దేశంలో ప్రస్తుతం ఇండియన్ టూవీలర్ మార్కెట్లో స్కూటీల హవా నడుస్తోందని చెప్పుకోవచ్చు. నేటి యువత ఎక్కువగా బైక్‌ల మీదనే కాదుస్కూటీల(Scooties)పై మంచి ఆదరణ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవి స్త్రీ, పురుషులిద్దరూ వయస్సుతో సంబంధం లేకుండా సులువుగా నడిపేందుకు వీలుగా ఉండటంతో అన్ని చోట్ల వీటి వినియోగం పెరిగింది. అలాగే గేర్లు మార్చడం ఉండదు కాబట్టి.. వీటిని నడపడం కూడా చాలా ఈజీ. చిన్న చిన్న సందుల్లో కూడా వీటిపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు. ఫ్లోర్ సెక్షన్, సీటు కింద ఉన్న కెపాసిటీ వల్ల వీటిపై ఎక్కడికైనా సామాను తీసుకెళ్లవచ్చు.
Top 5 Petrol Scooters in India : అందుకే ఎక్కువ మంది వినియోగదారులు స్కూటీల వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి స్టైలిష్‌తో సరికొత్త టెక్నాలజీతో వస్తున్న ఈ స్కూటర్లలో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ఇంజిన్ పవర్ కూడా మంచిగానే ఉంటుంది. అయితే ఇక మనలో చాలా మంది సాధారణంగా కొత్త బైక్ కొనే ముందు చూసేది రెండు విషయాలు. ఒకటి ధర. ఇంకోటి మైలేజ్. అయితే ఇక్కడ మేము మీకు రూ. లక్షలోపు బడ్జెట్ ధరలో(Best Scooties under 1 Lakh) ఉన్న టాప్ 5 ద్విచక్ర వాహనాల గురించి చెప్పబోతున్నాం.. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Top 5 most Affordable Petrol Scooters List :
దేశంలో ధరల జాబితాలో టాప్ 5 అత్యంత సరసమైన పెట్రోల్ స్కూటర్లు ఇవే..
హీరో డెస్టినీ ప్రైమ్(Hero Destini Prime) :ఈ స్కూటర్ 124.6 సీసీతో మార్కెట్లో అందుబాటులో ఉంది. హీరో డెస్టినీ ప్రైమ్ ప్రారంభ ధర రూ. 90,494గా ఉంది. BS6 మోటారుతో 9 bhp శక్తిని, 10.36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లతో రెండు చక్రాల వద్ద ఇంటిగ్రేటెడ్ డిసిలరేషన్ మెకానిజంను కలిగి ఉంది. i3S ఐడిల్ పాజ్ స్టార్ట్ సిస్టమ్ సాంకేతికతను కలిగి ఉంది. రద్దీ సమయంలో గ్రిడ్‌లాక్‌లో ఇంజిన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. Xtec వేరియంట్ మొబైల్ కనెక్టివిటీ బ్లూటూత్ ఫీచర్ ఉంది.
స్పెసిఫికేషన్స్(Specifications) :
- మైలేజ్ (మొత్తం)- 50 kmpl
- డిస్ప్లేస్మెంట్-124.6 cc
- ఇంజిన్ టైప్- ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, SI ఇంజిన్
- మ్యాక్స్ పవర్-9.1 PS @ 7000 rpm
- గరిష్ఠ టార్క్-10.4 Nm @ 5500 rpm
- ఇంధన సామర్థ్యం-5 Liters
హోండా డియో (Honda Dio) :హోండా డియో స్కూటర్లన్నింటిలో చూడటానికి చాలా స్టైలిష్ గా, ట్రెండీగా ఉంటుంది. యూత్ ఎక్కువగా దీనిని కొనడానికి ఇష్టపడుతుంటారు. ఈ స్కూటర్ ఫీచర్స్ ఆక్టివా ఐ లాగే ఉంటాయి. బరువు కూడా 103 కిలోలు ఉంటుంది. మార్కెట్లోహోండా డియోధర రూ. 87,479గా ఉంది.
- మైలేజ్-48kmpl
- ఇంజిన్ సామర్థ్యం - 109.51 సీసీ
- ఇంజిన్ టైప్-4 స్ట్రోక్, SI ఇంజిన్
- మ్యాక్స్ పవర్ 7.85 PS @ 8000 rpm
- మ్యాక్స్ టార్క్ 9.3 Nm @ 5250 rpm
- ఫ్రంట్ బ్రేక్ డ్రమ్
- వెనుక బ్రేక్ డ్రమ్
- ఇంధన సామర్థ్యం-5.3 ఎల్
హీరో ప్లెజర్+(Hero Pleasure +) :మార్కెట్లో హీరో ప్లెజర్+ ప్రారంభ ధర రూ. 86,578గా ఉంది. హీరో కంపెనీ దీనిని కారు బ్యూరెటెడ్ మోటార్‌తో పరిచయం చేసింది. ఏది ఏమైనప్పటికీ ఇది ఇప్పుడు కొత్త BS6 ఎగ్జాస్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంధన-ఇన్ఫ్యూషన్‌ను కలిగి ఉంది. దీంట్లో సవరించిన ఇంజన్ 10% ఎక్కువ పర్యావరణ అనుకూలమైనది. BS4 వెర్షన్ కంటే మెరుగైన టాప్ స్పీడ్‌ను అందిస్తుంది.