తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ డిమాండ్లకు ఒప్పుకుంటేనే.. భారత్​లో ప్లాంట్​పై మస్క్ క్లారిటీ - ఎలాన్​ మస్క్

Tesla car india: భారత్​లో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుపై మస్క్​ క్లారిటీ ఇచ్చారు. ఓ ట్విట్టర్​ యూజర్​ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్​లో టెస్లా ప్లాంట్​ స్థాపించే ఆలోచనే లేదని తెలిపారు. మరోవైపు స్టార్​లింక్​ ఇంటర్ననెట్​ సేవలను దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

మస్క్
మస్క్

By

Published : May 28, 2022, 10:56 AM IST

Tesla car india: భారత్​లో టెస్లా కార్ల విక్రయం, తయారీ కేంద్రాల స్థాపనపై ప్రయత్నాలకు విరామం ఇస్తున్నట్లు ఇటీవల టెస్లా సంస్థ ప్రకటించింది. అయితే ఎలాన్​ మస్క్​ తన నిర్ణయాన్ని మార్చుకుని త్వరలోనే ఈ ప్రీమియం ఎలక్ట్రిక్​ కార్లను అందుబాటులోకి తీసుకువస్తారని ఈవీ ఔత్సాహికులు ఆశించారు. కానీ మస్క్​ తాజా ప్రకటనతో టెస్లా వాహనాలు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని భావించిన వారికి నిరాశే మిగిలింది. భారత్​లో టెస్లా ప్లాంట్​ పెట్టే ఆలోచనే లేదని మస్క్​ స్పష్టం చేశారు.

'భారత్​లో టెస్లా తయారీ కేంద్రాలను స్థాపించే ఆలోచన లేదు. మొదట మా కార్ల విక్రయాలు, సర్వీసులకు అనుమతించని ఏ ప్రాంతంలోనూ తయారీ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయదు' అని మస్క్ ట్వీట్​ చేశారు. భవిష్యత్తులో భారత్​లో టెస్లా తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తుందా అని ఓ యూజర్​ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. స్పేస్​ఎక్స్​ ఆధ్వర్యంలో అమెరికా సహా పలు దేశాలు సేవలందిస్తున్న స్టార్​లింక్​ ఇంటర్నెట్​ భారత్​లోకి అడుగుపెట్టడంపై కూడా మస్క్​ స్పష్టతను ఇచ్చారు. త్వరలోనే భారత్​లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. కేంద్రం అనుమతే ఆలస్యమని ఓ యూజర్​ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ చెబుతూ వచ్చారు. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే మస్క్​ డిమాండ్లకు అంగీకరించని కేంద్రం.. కార్ల తయారీని భారత్​లోని చేపట్టాలని స్పష్టం చేయడం వల్ల టెస్లాను భారత్​లోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు బ్రేక్​ పడింది.

ఇదీ చూడండి :ఒక ఛార్జింగ్‌తో 590 కి.మీ. ప్రయాణం.. బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్​ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details