Tata Motors Year End Offers 2023 in Telugu: ఇయర్ ఎండ్‌కు వచ్చేశాం. ఈ క్రమంలో తమ సేల్స్ పెంచుకోవడానికి పలు ఆటోమొబైల్ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. తమ వాహనాలపై అదిరిపోయే ఆఫర్స్, ఊరించే డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా.. ఈ లిస్టులోకి దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ చేరింది. తన పోర్ట్‌ఫోలియోలోని ఎంపిక చేసిన కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ డిస్కౌంట్లో భాగంగా టాటా కార్లపై ఏకంగా రూ.1.25 లక్షల వరకు ఆదా చేసుకునే ఛాన్స్ లభించింది. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
2024లో లాంఛ్ కానున్న టాప్-5 సూపర్ స్టైలిష్ కార్స్ ఇవే!
ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు..
Tata Altroz:టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్‌పై రూ.20వేల వరకు కన్జ్యూమర్ డిస్కౌంట్, రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తోంది. ఇక ఆల్ట్రోజ్ సీఎన్జీ మోడల్‌పై రూ.10వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఆల్ట్రోజ్ పెట్రోల్ ఎంటీపై రూ.40వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఆల్ట్రోజ్ సీఎన్జీ ఫీచర్ల విషయానికి వస్తే.. ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతోపాటు వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి లేటెస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎలిమెంట్స్ ఎన్నో ఈ కారుకి అదనపు హంగులు కానున్నాయి.
బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న టాప్-7 కార్స్ ఇవే! స్టార్ రేటింగ్, ఎయిర్ బ్యాగ్స్ లెక్క ఇలా!
Tata Harrier : టాటా హారియర్ ఎంటీ-ఏటీ (నాన్ అడాస్) మోడల్స్‌పై రూ.50వేల కన్జ్యూమర్ డిస్కౌంట్, రూ.25వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది సంస్థ. మరోవైపు టాటా హారియర్ ఏటీ అడాస్ వేరియంట్‌పై రూ. 75వేల కన్జ్యూమర్ డిస్కౌంట్, రూ. 50వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ఈ మొత్తం కలుపుకుంటే.. ఈ డిసెంబర్లో టాటా హారియర్‌పై రూ.1.25లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు!
Tata Punch: టాటా మోటార్స్‌కు చెందిన బెస్ట్ సెల్లింగ్ వాహనాల్లో టాటా పంచ్ ఒకటి. ఇంతకాలం.. ఈ మోడల్‌పై ఎలాంటి తగ్గింపునూ ఇవ్వలేదు. ఇప్పుడు తొలిసారిగా టాటా పంచ్‌పై రూ.10వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది.
రూ.10 లక్షల్లోపు బెస్ట్ కారు కావాలా? ఈ 3 బ్రాండ్స్ చెక్ చేయండి - అదిరిపోయే ఫీచర్స్!
Year End Discounts on Tata Cars: మరోవైపు టాటా టియాగో సీఎన్జీ, టాటా టిగోర్ సీఎన్జీ సింగిల్ సిలిండర్ వేరియంట్‌పై రూ.60వేల కన్జ్యూమర్ డిస్కౌంట్‌తోపాటు రూ.15వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. టియాగో ఎంటీ పెట్రోల్ వేరియంట్‌పై రూ.55వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఏఎంటీ, సీఎన్జీ ట్విన్ సిలిండర్ మోడల్స్‌పై గరిష్ఠంగా రూ.45వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అదే సమయంలో టాటా టిగోర్‌పై రూ.40వేల డిస్కౌంట్‌తోపాటు రూ.15వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. ఇవి.. ఈ నెల చివరి వరకు అమల్లో ఉంటాయి. కాగా.. ఈ డిస్కౌంట్లు లొకేషన్ బట్టి మారే ఛాన్స్ ఉంది. అందువల్ల.. పూర్తి వివరాల కోసం సమీప షోరూమ్‌ను సంప్రదించండి.
TATA Safari Harrier Facelift Price and Features : టాటా నుంచి సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు.. ధర, ఫీచర్స్ చూస్తారా..?