తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా​ కార్లపై భారీ డిస్కౌంట్స్​ - ఏయే మోడళ్లపై ఎంతంటే? - కార్లపై లేటెస్ట్ డిస్కౌంట్​ ఆఫర్స్​

Tata Cars Diwali Offers 2023 : ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ టాటా మోటార్స్ తమ కార్లపై భారీ డిస్కౌంట్​ ఆఫర్లను ప్రకటించింది. వివిధ రకాల కార్లపై రాయితీలు​ కలుపుకొని ఒక్కో మోడల్​పై రూ.55 వేల నుంచి రూ.1,40,000 వరకు డిస్కౌంట్స్​ను అందిస్తోంది. ఆ వివరాలు..

Tata Cars Discounts 2023
Tata Cars Offers 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 2:51 PM IST

Tata Cars Diwali Offers 2023 : దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్..​ కార్​ లవర్స్​కు శుభవార్త వినిపించింది. తమ విజయవంతమైన కార్​ మోడల్స్​పై భారీ డిస్కౌంట్స్​ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో అన్ని రకాల ఆఫర్లు కలుపుకొని ఒక్కో ఎస్​యూవీపై కనీసం రూ.55,000 నుంచు రూ.1,40,000 వరకు డిస్కౌంట్స్​ పొందవచ్చు. మరి ఏయే కార్​పై ఎంత మేర డిస్కౌంట్​ (Tata Cars Discounts 2023) ఆఫర్స్​ ఉన్నాయో తెలుసుకుందాం..

టాటా టియాగో!
Tata Tiago Discount Offers : టాటా టియాగో(Tata Tiago) పెట్రోల్​ మోడల్​పై మొత్తంగా రూ.55,000 డిస్కౌంట్​ను అందిస్తోంది కంపెనీ.

క్యాష్​ డిస్కౌంట్ రూ.35,000
ఎక్స్ఛేంజ్​ బోనస్ రూ.15,000
కార్పొరేట్​ డిస్కౌంట్ రూ.5,000
టాటా టియాగో

టాటా టిగోర్​!
Tata Tigor Discount Offers : టాటా టిగోర్(Tata Tigor) పెట్రోలో వేరియెంట్​పై కూడా భారీ వరకు డిస్కౌంట్​ను ప్రకటించింది సంస్థ. నగదు రాయితీ, ఎక్స్ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్​ అన్నీ కలుపుకొని మొత్తం రూ.55,000 వరకు తగ్గింపు ధరతో టాటా టిగోర్ మోడల్​ను విక్రయిస్తోంది.

క్యాష్​ డిస్కౌంట్ రూ.35,000
ఎక్స్ఛేంజ్​ బోనస్ రూ.15,000
కార్పొరేట్​ డిస్కౌంట్ రూ.5,000
టాటా టిగోర్

CNG కార్లపై ఎక్కువే..
పెట్రోల్​ వేరియెంట్లతో పోలిస్తే టాటా టియాగో, టిగోర్ CNG మోడల్స్​పై రూ.20,000 డిస్కౌంట్​ను అదనంగా పొందవచ్చు. మొత్తంగా రూ.75,000 వరకు తగ్గింపు ధరలో వీటిని సొంతం చేసుకోవచ్చు.

ఓల్డ్​ సిలిండర్​ మోడల్స్​..
క్యాష్​ డిస్కౌంట్ రూ.50,000
ఎక్స్ఛేంజ్​ బోనస్ రూ.20,000
కార్పొరేట్​ డిస్కౌంట్ రూ.5,000
న్యూ ట్విన్​ సిలిండర్​ మోడల్స్​..
క్యాష్​ డిస్కౌంట్ రూ.50,000
ఎక్స్ఛేంజ్​ బోనస్ రూ.20,000
కార్పొరేట్​ డిస్కౌంట్ రూ.5,000
కన్స్యూమర్​ డిస్కౌంట్ రూ.20,000

టాటా పంచ్​!
Tata Punch Discount Offers : టాటాకు చెందిన మరో లీడింగ్​ మోడల్​ టాటా పంచ్​(Tata Punch). ఈ కాంపాక్ట్​ ఎస్​యూవీపై రూ.5,000 నుంచి రూ.10,000 వరకు నామినల్​ డిస్కౌంట్స్​ను అందిస్తోంది. ఈ ఆఫర్లు డీలర్​, ప్రాంతాన్ని బట్టీ మారవచ్చు.

టాటా ఆల్ట్రోజ్‌!
Tata Altroz Discount Offers : ప్రముఖ మోడల్​ టాటా ఆల్ట్రోజ్‌​(Tata Altroz)పై కూడా రూ.35,000 వరకు భారీ డిస్కౌంట్​ ఆఫర్​ను ప్రకటించింది కంపెనీ.

క్యాష్​ డిస్కౌంట్ రూ.20,000
ఎక్స్ఛేంజ్​ ఆఫర్ రూ.10,000
కార్పొరేట్​ డిస్కౌంట్ రూ.5,000
టాటా ఆల్ట్రోజ్‌

టాటా హారియర్‌!
Tata Harrier Discount Offers : ప్రీమియం రేంజ్​ కార్​ టాటా హారియర్​(Pre-Facelift Model)పై ఏకంగా రూ.1.40 లక్షల భారీ డిస్కౌంట్​ను అందిస్తోంది టాటా మోటార్స్.

క్యాష్​ డిస్కౌంట్ రూ.75,000
ఎక్స్ఛేంజ్​ ఆఫర్ రూ.50,000
కార్పొరేట్​ డిస్కౌంట్ రూ.15,000
టాటా హారియర్‌

టాటా సఫారీ!
Tata Safari Discount Offers :మరో ప్రీమియం ఎస్​యూవీ టాటా సఫారీ​(Pre-Facelift Model)ని కూడా రూ.1.40 లక్షల తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు.

క్యాష్​ డిస్కౌంట్ రూ.75,000
ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ రూ.50,000
కార్పొరేట్​ డిస్కౌంట్ రూ.15,000
టాటా సఫారీ

గమనిక : వివిధ కార్​ మోడల్స్​పై పైన తెలిపిన డిస్కౌంట్​ ఆఫర్స్​ ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఈ రేట్లు ప్రాంతం, డీలర్​షిప్​, స్టాక్​ లభ్యతపై ఆధారపడి ఉంటాయి. గమనించగలరు.

రూ.10 లక్షల బడ్జెట్లో - బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్​ ఉన్న టాప్​-5 కార్స్​ ఇవే!

దీపావళి కార్​ ఆఫర్స్ ​- ఆ మోడల్​పై ఏకంగా రూ.3.5 లక్షల డిస్కౌంట్!

స్టన్నింగ్​ ఫీచర్స్​తో నవంబర్​లో విడుదల కానున్న సూపర్​ కార్స్​ & బైక్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details