లక్షలాది బిర్యానీలతో 2023కి టేస్టీ వెల్కమ్.. బావర్చీలో నిమిషానికి రెండు.. స్విగ్గీ రికార్డ్! - 2023 న్యూ ఇయర్ స్విగ్గీ ఆర్డర్లు
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆహార ప్రియులు అత్యధికంగా బిర్యానీని ఆరగించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీ బిర్యానీకే అత్యధిక కస్టమర్లు మొగ్గు చూపినట్లు పేర్కొంది.
స్విగ్గీ డెలివరీలు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. అదే సమయంలో 2.5 లక్షల పిజ్జాలను సైతం కస్టమర్లకు అందించినట్లు పేర్కొంది.
- బిర్యానీ ఆర్డర్లు-3.50 లక్షలు
- పిజ్జా ఆర్డర్లు-2.5 లక్షలు
- హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ల శాతం-75.4 శాతం
- లఖ్నవీ బిర్యానీ ఆర్డర్ల శాతం-14.2 శాతం
- కోల్‌కతా బిర్యానీ ఆర్డర్ల శాతం-10.4 శాతం
- హైదరాబాద్‌లో అత్యధికంగా బిర్యానీ అమ్ముడైన రెస్టారెంట్- బావర్చీ
- బావర్చీ నుంచి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ
- బిర్యానీ డెలివరీలు(రాత్రి 7.20 నిమిషాల వరకు)- లక్షా 65 వేలు
- డామినోస్ పిజ్జా డెలివరీలు(శనివారం రాత్రి 10.25 నిమిషాల వరకు)- 61,287
- స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కండోమ్‌ల డెలివరీ- 2,757
- కిచిడీ ఆర్డర్లు(రాత్రి 9.18 నిమిషాల వరకు)- 12,344
- చిప్స్ ఆర్డర్లు(రాత్రి 7 గంటల వరకు)-1.76 లక్షలు
- ఇవీ చదవండి:
- వంట గ్యాస్ ధర పెంపు.. సిలిండర్‌కు ఎంతంటే..
- టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా? ఈ 'రైడర్లు' గుర్తుపెట్టుకోండి!
Last Updated : Jan 1, 2023, 2:30 PM IST