తెలంగాణ

telangana

ETV Bharat / business

దలాల్​ స్ట్రీట్​పై ఫెడ్​ దెబ్బ- సెన్సెక్స్​ 1000 మైనస్​ - stock market india

stock markets today
స్టాక్​ మార్కెట్స్​ లైవ్ అప్డేట్స్

By

Published : Jun 16, 2022, 1:30 PM IST

Updated : Jun 16, 2022, 3:39 PM IST

14:46 June 16

సెన్సెక్స్​ 1000 పాయింట్లు డౌన్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, అమెరికా ఫెడరల్​ రిజర్వ్​​ వడ్డీ రేట్ల పెంపు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశీయంగా కరోనా కేసులు పెరగడమూ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్​ ఏకంగా 1000కిపైగా పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 15,400 దిగువకు చేరింది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1046 పాయింట్ల నష్టంతో 51,496 పాయింట్ల వద్ద స్థిరపడింది
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 332 పాయింట్లు పతనమై 15,360 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి..నెస్ట్లే, బ్రిటానియా మాత్రమే స్వల్ప లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, కోల్​ఇండియా, టాటా మోటార్స్​ 5 శాతానికిపైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

మార్కెట్ల పతనానికి కారణాలివే: ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుతో అమెరికా మార్కెట్లు నిన్న లాభాలతో ముగిశాయి. దీంతో దేశీయ సూచీలు కూడా ఈ ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండటంతో కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 600 పాయింట్లు పెరిగింది. అయితే, ఆ జోరు ఎంతోసేపు నిలవలేదు. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అమెరికాలో మాంద్యం, ద్రవ్యోల్బణ భయాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. దీంతో ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు.. భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి.

13:26 June 16

స్టాక్​ మార్కెట్స్​ లైవ్ అప్డేట్స్

Stock market today: దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 800పాయింట్లకుపైగా క్షీణించి 51,715 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 265 పాయింట్లు తగ్గి 15,425 వద్ద ట్రేడవుతోంది. ఇవి 52 వారాల కనిష్ఠం కావడం గమనార్హం. గత కొద్దిరోజులుగా మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.

బ్రిటానియా, మారుతీ సుజుకీ స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విప్రో, ఓఎన్​జీసీ, టాటా స్టీల్​ అత్యధికంగా నష్టపోయాయి. సిప్లా, భారతీ ఎయిర్​టెల్​ కూడా డీలాపడ్డాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడం ఈ నష్టాలకు ప్రధాన కారణం. కీలక వడ్డీ రేటును 0.75 శాతం పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం ప్రకటించింది. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు కావడం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణం మేలో 41 ఏళ్ల గరిష్ఠమైన 8.6 శాతానికి చేరడంతో, అదుపు చేసేందుకు ఫెడ్‌ రేట్ల పెంపునకు మొగ్గు చూపింది. తాజా పెంపుతో ప్రామాణిక ఫెడరల్‌ ఫండ్‌ రేట్లు 1.5%-1.75% శ్రేణికి చేరాయి. 2020 మార్చిలో కొవిడ్‌ మహమ్మారి ప్రారంభానికి ముందు ఈ స్థాయిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. దేశీయంగా కరోనా కేసులు పెరగడమూ మదుపర్ల సెంటిమెంట్​పై ప్రతికూల ప్రభావం చూపినట్లు సమాచారం.

Last Updated : Jun 16, 2022, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details