Stock Market Updates : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1,181 పాయింట్లు వృద్ధిచెంది 61,795 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 321 లాభపడి 18,349కు చేరింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్, విప్రో, టాటాస్టీల్, యాక్సిస్ బ్యాంకు, టైటాన్, నెస్లే ఇండియా, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి.
అమెరికాలో అక్టోబరు నెలలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే కూడా దిగువకు చేరింది. వరుసగా నాలుగో నెలా తగ్గి 7.7 శాతంగా నమోదైంది. దీంతో వడ్డీరేట్ల పెంపు విషయంలో ఫెడరల్ రిజర్వ్ వెనక్కి తగ్గొచ్చన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపాయి. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ రాణించాయి.