Stock Market Today 11th September 2023 : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా 7వ రోజు కూడా భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 50 మొదటిసారిగా 20,000 పాయింట్లు దాటి ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను నమోదుచేసింది. దేశీయ పెట్టుబడిదారులు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 528 పాయింట్లు లాభపడి 67,127 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 176 పాయింట్లు వృద్ధి చెంది 19,996 వద్ద స్థిరపడింది.
- లాభాలు పొందిన షేర్స్ : విప్రో, టాటాస్టీల్, మారుతి సుజుకి, ఎస్బీఐ, టాటా మోటార్స్, టీసీఎస్, టైటాన్, ఇన్ఫోసిస్
- నష్టపోయిన స్టాక్స్ : ఎల్ అండ్ టీ, బజాజ్ఫిన్సెర్వ్
అన్నీ మంచి శకునములే!
India Stock Market Today : జీ20 సమ్మిట్ విజయవంతంగా ముగియడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లకు కలిసి వచ్చింది. దీనికి తోడు జీఎస్టీ వసూళ్లు పెరగడం, ప్రైవేట్ కేపిటల్ ఎక్స్పెండీచర్, క్రెడిట్ గ్రోత్ వృద్ధి చెందడం సహా, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందనే అంచనాలు.. మదుపరుల సెంటిమెంట్‌ను బాగా బలపరిచాయి.