Stock Market Closing Today : వారాంతపు సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 887.64 పాయింట్లు నష్టపోయి 66,684.26 వద్ద ముగిసింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ వరుసగా ఆరు రోజులు జోరును కొనసాగించగా శుక్రవారం మాత్రం నష్టాలను చవిచూసింది. కాగా, సూచీ 234.15 పాయింట్లు క్షీణించి 19,745 వద్ద స్థిరపడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ వద్ద ఆదాయ వృద్ధి అంచనాలను 4-7 శాతం నుంచి 1-3.5 శాతానికి ఇన్ఫోసిస్ తగ్గించిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు కుదేలైంది. శుక్రవారం నిఫ్టీ ట్రేడింగ్‌లో 7 శాతానికి పైగా నష్టపోయిన ఇన్ఫోసిస్ షేర్ సెన్సెక్స్ సూచీలో 8.18 శాతం షేర్ విలువను నష్టపోయింది. అలాగే అంతర్జాతీయంగా అనిశ్చితులు మార్కెట్లకు ప్రతికూల సంకేతాలు పంపాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
ఇన్ఫోసిస్ ఎఫెక్ట్..
Stock Market Closing Points Today : అయితే ఇన్ఫోసిస్ ప్రకటన ప్రభావం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మొత్తంగా మార్కెట్ ముగింపు సమయానికి 36 నిఫ్టీ షేర్లు నష్టాలతో ముగియగా.. 14 స్టాక్‌లు లాభపడ్డాయి.