భారత స్టాక్మార్కెట్లు మంగళవారం సెషన్లో నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 567 పాయింట్లు కోల్పోయి 55,107కు చేరగా ఎన్ఎఈ నిఫ్టీ 153 పాయింట్లు తగ్గి 16,416 వద్ద స్థిరపడింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్ఎస్టేట్ సెక్టార్ల షేర్లు 1 శాతం తగ్గాయి. మరోవైపు ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్ రంగాలకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేసేందకు మదుపర్లు ఆసక్తి చూపించారు.
మార్కెట్లు మొదలైన సమయానికి 55,373 వద్ద ఉన్న సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడయింది. గరిష్ఠంగా కేవలం 14 పాయింట్లు పెరిగి 55,387కు చేరిన సెన్సెక్స్.. ఒకానొక దశలో కనిష్ఠంగా 54,882కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛెంజీలో కూడా ఇదే పరిస్థితి. 16,469 వద్ద ప్రారంభమైన సూచీలు.. 16,487 గరిష్ఠాన్ని నమోదు చేయగా.. ఓ దశలో 16,347 కనిష్టానికి చేరుకున్నాయి.
- ఎన్టీపీసీ, మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐన్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
- టైటాన్, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఎల్టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.