పెరుగుతున్న వడ్డీ రేట్లు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
09:28 May 06
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market Live Updates: అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుదేలయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా కోల్పోయి.. 55 వేల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 210 పాయింట్ల పతనంతో 16 వేల 470 వద్ద కొనసాగుతోంది. గత సెషన్లోనూ ఓ దశలో 900 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్ చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా మార్కెట్లు గురువారం సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.
రిలయన్స్, ఎం అండ్ ఎం మాత్రమే స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, బజాజ్ ఫినాన్స్, మారుతీ సుజుకీ భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో దాదాపు అన్నీ నష్టాల్లోనే సాగుతున్నాయి. ఐటీ, లోహం, రియాల్టీ రంగం షేర్లు 2 శాతం మేర పతనమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ ఓ దశలో దాదాపు 1000 పాయింట్లు నష్టపోయింది. వడ్డీరేట్ల పెంపు భయాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచడం, దేశీయంగానూ వివిధ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుండటం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.