stock market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో సానుకూలత, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన ప్రకటన వెలువడటం వల్ల ఆయా షేర్లు దూసుకెళ్లటమూ కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపటం వల్ల తిరిగి 60వేల బెంచ్ మార్క్‌ను దాటింది సెన్సెక్స్.
ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 1335 పాయింట్ల వృద్ధితో 60,612 వద్ద స్థిరపడింది. 59,764 పాయింట్ల వద్ద ఈ వారం సెషన్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ ఒక దశలో 60,845 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 60,612 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ... 383 పాయింట్ల లాభంతో 18,053 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,809 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒక దశలో 18,115 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 18,053 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి: హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెడ్డీఎఫ్సీలు సుమారు 10 శాతం మేర లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 4శాతం, హెడ్‌డీఎఫ్‌సీ లైఫ్ 3.83శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 3.23 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు.. ఇన్ఫోసిస్ ఒక శాతానికిపైగా నష్టపోయింది. టైటాన్ కంపెనీ, జెఎస్ డబ్ల్యూ స్టీల్‌లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి:హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీనం.. దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దది!